బాల్యం
అయ్యా ! సారువాడే! నమస్తే! ఏమీ నిండా కొబంగా ఉండిపొడుస్తున్నారు? ఈ మధ్య కనబడటం లేదనా? ఏం చెప్పమంటారూ! ఎన్ని కష్టాలో కదా మానవుడికి? చిన్నప్పుడే బాగుండేది. చీకూ నై! చింతా నై! ఆల్వేస్ హ్యాపీస్! ఇప్పుడో? నవ్వాలంటే అదేదో డ్యూటీ లాగా అయిపోయింది. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఉండేవాడిని!అదొక పల్లెటూరు. ఈ మీన్ నేనూ మా అన్నానూ! ఎందుకంటే మా అమ్మ హెల్త్ విజిటర్ ట్రైనింగ్ లో ఉంది హైదరాబాద్ లో! మా నాన్నకేమో తెనాలి లో ఉద్యోగం! నేను చిన్న వాడిని! 4 ఏళ్ళు అనుకుంటా! మా అన్నకి ఓ పది ఏళ్ళు ఉంటాయి. ఆ వయసుకే వాడు తాటి చెట్టు ఎక్కి గెలలు తెంపడం, మామిడి తోపుల్లో మామిడికాయలు దొంగతనం చేయడం లాంటి అఘాయిత్యపు పనులు చేసేవాడు. బడి లేనప్పుడు వాడు ఇంటిముందున్న వేప చెట్టెక్కీ కంటికి కనబడేవన్నీ వివరిస్తూ ఊరిస్తూ వుండేవాడు! నాకేమో చెట్టెక్కడం రాదాయే? తెగ కుళ్లుకునేవాడిని! గాలికి తిరిగితే చెడిపోతాడని కొన్నాళ్లు నన్ను ఇంటి దగ్గర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కి పంపేవాళ్ళు! అప్పటికే నేను అచ్చులు హల్లులు, గుణింతాలు రైమ్స్ ఒక్కటేమిటి అన్నీ ఇంటి దగ్గరే నేర్చేసుకున్నా! మా క్లాస్ లో పిల్లలేమో అక్షరాల్తో ...
