పాపం భర్తలు-3
హాయ్ గయ్స్! హౌ ఆర్యూ డూయింగ్?
వెరీ వెరీ ఆనందమ్స్! మళ్ళీ మనం కలిశాం! కలిసినందుకు ఏదైనా ప్రయోజనం ఉండాలి గందా? ఎందుకు లేదూ? పాపం! భర్తల టాపిక్ ఉండనే ఉంది కదా? అదే చెప్పుకుందాం! మీ శ్రీమతులకి తెలియనీకండి! అనవసరంగా నేను చిక్కుల్లో పడతాను! యావంటారూ?
ఇంకో అత్తగారి ప్రహసనం ఏమిటంటే, నా పాత మిత్రుడు ఆనందరావు అత్తగారు! ఆవిడ సాంతం పల్లెటూరినుంచి వచ్చింది! చదువూ సంధ్యా పెద్దగా లేవు! ఏదో నాలుగు మెతుకులు (అబ్బా! నాలుగంటే నాలుగు కాదులేండీ!! అందరికీ సరిపడే కుంభం! సరేనా?) ఉడకేసి పెట్టటం, మిగిలిన టైములో పక్కింటి పిన్నిగారితోనో, వెనకింటి వనజాక్షి గారితోనా కూరా నారా, చీరలు, నగలు మొదలైన కబుర్లతో కాలం వెళ్ళబుచ్చడంతో ఆవిడ జీవితం ముప్పాతిక గడచిపోయింది! ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని ఆనందరావుకి ఇవ్వడంతో కథ మొదలైంది! ఆవిడకి పుట్టెడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుట! అందరూ తన్ని చూసి నవ్వుకుంటుంటారని ఆవిడకి ప్రగాఢ అనుమానం! ఎక్కువ శాతం కూతురు దగ్గరే ఉంటుంది! మనోడేమో సాంతం దధ్ధోజనం, ఎవర్నీ ఏమీ అనడు, పట్టించుకోడు! ఎప్పుడైనా ఆఫీసులో గోడవలకి మనోడు చిరచిరలాడుతూ ఉంటే, అత్తగారు ఆ చిరాకుని తనకి ఆపాదించుకుని, "మీ ఆయనకి నేను ఇక్కడికి రావటం ఇష్టంలేనట్టుగా ఉందే అమ్మా అని కళ్ళొత్తుకొని అన్నం తినటం మానేసి పడుకొని ఉండటం, ఇది చూసి వీడి శ్రీమతి " ఆవిడేం చేసింది మిమ్మల్నీ, మీకసలు మా అమ్మ పొడే గిట్టదు!" అంటూ నాల్రోజులు సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు! మనోడికి ఏమైనా అర్థమైతేగా? ఏవీ చెయ్యకపోయినా, తానేమీ ఆ అర్థంలో వ్యవహరించలేదని సంజాయిషీ ఇచ్చుకుని ఆ పైన బ్రతిమాలుకుని దారికి తెచ్చుకోవడం పరిపాటైపోయింది!
మగాళ్ళమీద ఇంత ఘోరాలు జరుగుతుంటే మగాళ్ళమీద గృహ హింస కేసులు నమోదవుతాయేంట్రా అన్నాడొకసారి మిత్రుడు సురేష్ మా ఆవిడ ఉండగానే! "నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి రావుగారూ అని తప్పించుకున్నా! వామ్మో! లేకపోతే ఇంకేమయినా ఉందా?
ఇంకేమయినా ఉందా అంటే మరి చాలా ఉందీ,
ప్రస్తుతానికి శెలవ్!! తర్వాత...
(ఇంకా ఉంది)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి