నవ్వు--మనం--2
వందనం!
అందరూ కుశలమే కదా? భ్రాతల్, సతీ సుతుల్, చుట్టముల్ ఎట్సెటరా....? శుభం!
వందనాన్నే జంధ్యావందనం అన్నారు జంధ్యాలగారు! నాకు ఇష్టులలో వారొకరు! మంచి లేత కొబ్బరి పాకంలాంటి హాస్యం! ముతకగా ఉండదు! సునిశితమైన నాజూకు హాస్యం! వందనాలే ఎందుకురా, వెయ్యినాలు, లక్షనాలు ఉండవేమిట్రా అంటాడు విజయరామ్! నాకేం తెలుసుగనక? ఏది ఏమైనా నాకు మట్టుకు జీవితంలో ఆనందం కలిగించే , మనల్ని కాసేపు నవ్వించి మైమరపించే హాస్యంగానీ జీవితంలో లోపిస్తే అంతకన్నా అసంతృప్తి లేదు! కార్యసాధన, గర్వాన్నీ, కాన్ఫిడెన్స్ నీ ఇస్తే, తృప్తి, సంతోషం అపజయాలనుంచి సేదతీర్చి ముందుకు నడిపిస్తుంది! నవ్వు ఎనర్జీ ఇచ్చే టానిక్ లాంటిది!
అయితే అసంతృప్తిని ఏనాటికీ మన దరిచేరనీయకూడదు అనేవాడు మా మితృడు పామరాజు వెంకట నరసింహారావు. కానీ మనకి నిత్యజీవితంలో ఎంతోమంది అసంతృప్తితో రగిలిపోతూ, అందుకు పరిష్కారం వెదుక్కోకుండా జీవితం దుఃఖభాజనం చేసుకుంటూ, చుట్టూ ఉన్నవారి జీవితాలు దుఃఖమయం చేస్తారు! అదిగో మనసున మనసై అంటున్నాడు ఘంటశాల! ఎంత బాగుంటుందో ఈ పాట! నిజమే! అర్థం చేసుకోని తోడు, అసలు తోడేలేని జీవితం విషాదమయం! దానికీ కొన్ని పరిష్కారాలుంటాయి! జీవితం ఆ ఒక్కదానితో అయిపోదుగా మరి?
కొంతమంది ఉంటారు. వాళ్ళు జీవితంలో ఏ కలెక్టరో, ఏ యాక్టరో అయిపోదామనుకుంటారు. వారి ప్రయత్న లోపమో, పరిస్థితులు అనుకూలించకో చివరికి ఏ క్లర్క్ గానో ఇంకేదో చిన్న ఉద్యోగంలోనో తేలుతారు! ఇక వీళ్ళెప్పుడూ అసంతృప్తిని బుర్రలో నింపుకుని, ఫ్రస్ట్రేషన్ లో బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటివాళ్ళు చాలా ఆఫీసుల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసుల్లో కనబడతారు. మనం ఏ డాక్యుమెంటో ఏదో అడిగితే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మనమీదే ఓలకబోస్తూ గయ్ మంటారు! ప్రపంచం మొత్తం భారాన్నీ తామే మోస్తున్న ఫీలింగ్ వీళ్ళ మొహంలో కారుతూంటుంది!
బాబోయ్!! ఏమిటీ, వాడిగా వేడిగా మిమ్మల్ని చెండాడేస్తున్నానా? నాకే బుర్ర వేడెక్కిపోయింది మరి!! ఓ ఛాయ్ లోపల వేసి నాలో నేనుని బయటేస్తా!
ఇప్పుడే వస్తా!!
ఇంకా అవలేదుగా మరి?
(ఇంకా ఉంది!!)
నవ్వొక భోగం, నవ్వు లేనివాడు రోగి అన్నారుగా పెద్దలు.
రిప్లయితొలగించండినీలోని "మిమ్ములను " నెమ్మదిగా వెలికి తీస్తున్నారుగా.