ఇంతకీ మనకేమైంది?-3


 ప్రియమైన మిత్రులారా!

నాలోమీరు!  మీలో నేను!

నాలో సుడితిరిగే ఆలోచనలు పంచుకోడానికి వచ్చిన మిత్రులందరికీ పునఃస్వాగతం! 

పునః అనంగానే నవ్వొస్తుంది సుమా!! 5 ఏళ్ళ పదవీ కాలంలో పొట్ట బిర్రెక్కేంతగా మేసేసిన ఓ ఎమ్ఎల్ఏ గారు, ఈ అయిదేళ్ళూ మీ సేవకే అంకితమై పోయాను, వచ్చే ఎలక్షన్ లో కూడా గెలిపిస్తే మీ సేవకు పునః అంకితమై పోతాను అన్నాడట! ఇలా ఎంతోమంది మనకి పునః అంకితమైపోతుంటారు!! మనం మాత్రం  ఎక్కడున్నావే గొంగళీ అంటే వేసినచోటే ఉన్నా అన్న చందంగా అక్కడే ఉంటాము!! 

ఇలా ఎందుకన్నానంటే, చిన్నప్పుడు ఏదో ఇంగ్లీష్ మూవీలో కిచెన్ లో మంచినీళ్ళ పంపు, పక్కనే కడగడానికి ఉపయోగించే నీటి పంపూ రెండూ ఉండటం చూసి, హబ్బ! మనకి కూడా ఇలాగా వచ్చే రోజులొస్తే బాగుణ్ణూ అనుకున్నా!! వీధి పంపు దగ్గర మంచి నీళ్ళకోసం తెల్లవారి అయిదింటికి వంతు కోసం క్యూ లో నిలబడ్డ అనుభవాలు అంత బాగుండవు కదా మరి? కడిగే నీటి కోసం, స్నానాల నీటి కోసం బావిలో చేదవేసి బకెట్లు బకెట్లు తోడటం, బోరు పంపుని ఎగిరెగిరి కొట్టటం ఇంకా మరపుకు రాలేదు మరి!  ఇప్పటికి ముసలితనం వచ్చేస్తున్నది, అయినా బోరు నీళ్ళు మాత్రమే పంపులో వస్తున్నాయి! త్రాగే నీరు మాత్రం క్యాన్లు కొనుక్కోవడమే!! 

పంపులో మంచినీరు ఇంకా రావట్లేదు!! 

హబ్బా!! ఈ మనసు ఆలోచనలను ఎలా పొంగించేస్తుందో కదా!? ఏదో చెబుతూ ఎటో వెళ్ళిపోతున్నా!! నవ్వొస్తోంది!! 

అటు తిరిగి, ఇటు తిరిగీ మళ్ళీ నవ్వు దగ్గరకే వచ్చాంగా? 

అది సరే, నవ్వినప్పుడు మనం ఎంత అందంగా కనబడతామో తెల్సా? మనల్ని మనం నవ్వుతుండగా అద్దంలో చూసుకున్నా, నవ్వేవాళ్ళని ఎవరిని చూసినా గానీ అందంగా కనబడతారు. బాగోలేరు‌ అనుకోలేం! నవ్వేప్పుడు ప్రపంచంలోని ఆత్మవిశ్వాసం మొత్తం మనదగ్గరే పోగుపడి ఉంటుంది! నాకైతే నవ్వుతుండగా అద్దంలో చూసుకుంటే భలే ముద్దొచ్చేస్తాను నాకు నేను!!

మీకు నవ్వొస్తోందా? 

ఇంకేం? స్వేఛ్ఛగా నవ్వండీ!!

నవ్వటం అయిపోయాకా మళ్ళీ ఇక్కడికే రండి! 

అయిపోయిందనుకుంటున్నారేమో? అబ్బే!!

(ఇంకా...ఉంది!)


కామెంట్‌లు

  1. మీరలా చెబుతుంటే నిజంగానే నవ్వు వచ్చింది. కానీ అద్దం ముందుకు పోలేకపోయాను.
    ఓ సారి నేను కూడా అద్దంలో చూసుకునే ప్రయత్నం చేస్తా (నవ్వుకునేప్పుడు) ...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు