భూకంప విలయం!!
సిరియా, డమాస్కస్ మరి ఇతర నగరాలలో ఈ రోజు సెప్టెంబర్ 23న వచ్చిన భూకంపం వేలమందిని పొట్టనబెట్టుకుంది! హృదయాన్ని వికలం చేసే ఈ ఘటన ప్రకృతి ముందు మనం ఎప్పటికీ అల్పులమేనా అన్న ఆలోచనే కలుగజేస్తోంది! ప్రాణం పోయేముందు ఆ జీవి పడే బాధ, యాతన తలచుకుంటే బాధ, భయం కలుగుతాయి. ఓ ప్రాణి ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి ఇంత వేదన, కష్టం అవసరమా? ప్రకృతి భూకంపాలు ఎందుకు సృష్టిస్తుందీ? ప్రకృతి పట్ల మనం చేసే తప్పులు భూకంపాలకు ఓ కారణం కూడా కావచ్చు! ఇలాంటి విపత్తులు మనిషికి కళ్ళు తెరిపిస్తాయా?? యుధ్ధాలతో చలి కాగే మనిషి, మతం మత్తులో జోగే మనిషి, కులం రొచ్చులో దొర్లే మనిషి, ఇవన్నీ పుర్రెలో ఇంకించుకుని,సాటి మనిషిని దూరం చేసుకుంటున్న మనిషి మానవతావాదం ముందు ఈ బేధాలు, వ్యత్యాసాలు ఎంత అల్పమైనవో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా అవలోకనం చేసుకుంటాడా??
.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి